నా భూమి నాకు ఇప్పించండి.. లేదంటే సచ్చిపోతాం

దిశ, కొత్తగూడెం: నా భూమి నాకు ఇప్పించండి.. లేదంటే భార్యాబిడ్డలతో సామూహిక ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే జూలూరుపాడు, కొత్తూరు గ్రామానికి చెందిన గొల్లపూడి మల్లయ్యకు నలుగురు సంతానం. మల్లయ్య మరణించకముందు ముగ్గురు కొడుకులకు నాలుగు ఎకరాల చొప్పున, కూతురుకి రెండు ఎకరాలు పెద్దమనుషుల సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు. కానీ, చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాసరావుకి వ్రాసి ఇచ్చిన భూమిని తన అన్నయ్య గొల్లపూడి శ్యాం సుందర్ […]

Update: 2021-09-10 08:55 GMT

దిశ, కొత్తగూడెం: నా భూమి నాకు ఇప్పించండి.. లేదంటే భార్యాబిడ్డలతో సామూహిక ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే జూలూరుపాడు, కొత్తూరు గ్రామానికి చెందిన గొల్లపూడి మల్లయ్యకు నలుగురు సంతానం. మల్లయ్య మరణించకముందు ముగ్గురు కొడుకులకు నాలుగు ఎకరాల చొప్పున, కూతురుకి రెండు ఎకరాలు పెద్దమనుషుల సమక్షంలో రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు.

కానీ, చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాసరావుకి వ్రాసి ఇచ్చిన భూమిని తన అన్నయ్య గొల్లపూడి శ్యాం సుందర్ రావు కబ్జా చేస్తున్నాడని బాధితుడు వాపోయాడు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, పాసుపుస్తకాలతో సహా ఉన్నాయని, ప్రతియేటా రైతుబంధు కూడా వస్తుందన్నాడు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. శ్యాంసుందర్ తన పలుకుబడిని ఉపయోగించి పొలంలో వ్యవసాయం చేస్తున్నాడని, అడ్డుపడ్డ తమపై భౌతిక దాడులు చేశారని బాధితుడు ఆరోపించారు.

చివరకు కోర్టు ఇచ్చిన ప్రొడక్షన్ ఆర్డర్‌ను సైతం లెక్క చేయక జూలూరుపాడు పోలీసులు తన అన్నయ్యకే మద్దతు పలుకుతున్నారని.. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోకూడదని జిల్లా పోలీస్ బాస్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కిందిస్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఇప్పటికైనా పోలీసులు.. రెవెన్యూ అధికారులు సరైన విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని.. లేకుంటే భార్యా పిల్లలతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడతానని కన్నీరుపెట్టుకున్నాడు.

Tags:    

Similar News