సినిమా కోసం తనను తాను గాయపరుచుకున్న హీరో
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ స్టారింగ్ ‘సర్దార్ ఉదమ్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్‌లో మూవీ రిలీజ్ కాబోతుండగా ఇందుకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో ఫేస్‌పై కనిపించే స్కార్(గాయం) ప్రోస్థెటిక్ ఎఫెక్ట్ కాదని.. నిజమైనదని తెలిపిన విక్కీ.. షూటింగ్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు తనను తాను గాయపర్చుకున్నానని, 13 స్టిచెస్ పడినట్లు చెప్పాడు. ఈ గాయమే సినిమాలో ఒక పార్ట్ అయిపోయిందని […]
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ స్టారింగ్ ‘సర్దార్ ఉదమ్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో గ్రాండ్‌గా జరిగింది. అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్‌లో మూవీ రిలీజ్ కాబోతుండగా ఇందుకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ చిత్రంలో ఫేస్‌పై కనిపించే స్కార్(గాయం) ప్రోస్థెటిక్ ఎఫెక్ట్ కాదని.. నిజమైనదని తెలిపిన విక్కీ.. షూటింగ్ ప్రారంభమయ్యే కొన్ని రోజుల ముందు తనను తాను గాయపర్చుకున్నానని, 13 స్టిచెస్ పడినట్లు చెప్పాడు. ఈ గాయమే సినిమాలో ఒక పార్ట్ అయిపోయిందని వివరించాడు. ‘సర్దార్ ఉదమ్’ మూవీ విప్లవకారుడు ఉద్దమ్ సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందించగా.. ఆయన 1919లో జలియన్ వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగా మార్చి 13, 1940లో పంజాబ్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్‌ను లండన్‌లో హత్యచేశాడు.