నాయిని మృతి పట్ల ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి
దిశ, వెబ్డెస్క్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, స్నేహశీలి శ్రీ నాయిని నర్సింహారెడ్డి పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఇద్దరం దాదాపుగా ఒకే సమయంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. అప్పటి నుంచి వారితో సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. […]
దిశ, వెబ్డెస్క్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, స్నేహశీలి శ్రీ నాయిని నర్సింహారెడ్డి పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఇద్దరం దాదాపుగా ఒకే సమయంలో అసెంబ్లీలో అడుగుపెట్టాం. అప్పటి నుంచి వారితో సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయమంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, స్నేహశీలి శ్రీ నాయిని నర్సింహారెడ్డి పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/nQbekfB5up
— Vice President of India (@VPSecretariat) October 22, 2020