సర్వదర్శనం టోకెన్లు జారీ
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సర్వదర్శనం కోసం టీటీడీ సోమవారం ఉచిత టోకెన్లు జారీ చేసింది. రోజుకు 3వేల చొప్పున ఉచిత టోకెన్‌లను ఇస్తుండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కౌంటర్ల దగ్గర బారులు తీరారు. ప్రారంభించిన రెండు గంటల వ్యవధిలోనే టోకెన్‌లు అయిపోయాయి. కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన ఏడు నెలల తర్వాత సర్వదర్శనం టోకెన్లు లభిస్తుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన […]
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సర్వదర్శనం కోసం టీటీడీ సోమవారం ఉచిత టోకెన్లు జారీ చేసింది. రోజుకు 3వేల చొప్పున ఉచిత టోకెన్‌లను ఇస్తుండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కౌంటర్ల దగ్గర బారులు తీరారు. ప్రారంభించిన రెండు గంటల వ్యవధిలోనే టోకెన్‌లు అయిపోయాయి. కరోనా నేపథ్యంలో నిషేధం విధించిన ఏడు నెలల తర్వాత సర్వదర్శనం టోకెన్లు లభిస్తుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ పెంచింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి నవంబరు కోటా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అదనంగా 3 వేలు ప్రత్యేక ప్రవేశ దర్శనం, 3వేల సర్వ దర్శన టికెట్లు కేటాయించింది. పెరిగిన దర్శన టికెట్లుతో రోజుకి 23వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం భాగ్యం కలుగుతుంది.