ఏపీని అభినందించిన వెంకయ్యనాయుడు

కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు ఏపీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకోవడం శుభపరిణామమని ఆయన అభినందించారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించవచ్చని, ఇది మంచి నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. […]

Update: 2020-04-18 06:11 GMT

కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు ఏపీ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకోవడం శుభపరిణామమని ఆయన అభినందించారు. కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించవచ్చని, ఇది మంచి నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగం పెరిగేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

tags: venkaiah naidu, vice president, delhi, twitter, corona

Tags:    

Similar News