నిషేధించాలంటూ మద్యం సీసాల ధ్వంసం

దిశ, రంగారెడ్డి: గ్రామంలో మద్యం నిషేధిస్తూ పంచాయతీ గతంలో తీర్మానం చేసింది. అయినా గ్రామంలో బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దీంతో మద్యంప్రియులు మద్యం తాగుతూ గ్రామంలో ఘర్షణలకు పాల్పడుతున్నారు. దీంతో విసిగివేసారిన మహిళలు, యువకులు బుధవారం మద్యం బాటిళ్లను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన కేశంపేట మండలం వేములనర్వలో చోటుచేసుకుంది.

Update: 2020-06-10 06:11 GMT

Tags:    

Similar News