ఓఆర్ఆర్‌పైకి నో ఎంట్రీ

హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చే వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయని, అందువల్ల రంగారెడ్డిలోని ఔటర్ రింగు రోడ్డుపైకి వచ్చే వాహనాలకు శనివారం నుంచి అనుమతి నిలిపి వేస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కార్యాలయం స్పష్టం చేసింది. లాక్ డౌన్ అమల్లో ఉన్నంతవరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. అయితే, ట్రక్కులు, లారీలు వంటి భారీ వాహనాలకు నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. మిగతా వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించింది. కాగా, […]

Update: 2020-03-28 02:27 GMT

హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చే వాహనాలు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయని, అందువల్ల రంగారెడ్డిలోని ఔటర్ రింగు రోడ్డుపైకి వచ్చే వాహనాలకు శనివారం నుంచి అనుమతి నిలిపి వేస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కార్యాలయం స్పష్టం చేసింది. లాక్ డౌన్ అమల్లో ఉన్నంతవరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. అయితే, ట్రక్కులు, లారీలు వంటి భారీ వాహనాలకు నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. మిగతా వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించింది. కాగా, శుక్రవారం అర్ధరాత్రి ఇదే ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags: ORR, ring road, lockdown period, cyberabad, traffic police, heavy vehicles

Tags:    

Similar News