మార్కెట్ లోకి వాహనాల రాకపోకలు బంద్: ఏసీపీ అఖిల్ మహాజన్

దిశ, మంచిర్యాల: సద్దుల బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మార్కెట్లోకి వాహనాల ప్రవేశం నిషేధించడం జరిగిందని ఏసీపీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ ప్రాంతంలో చాలా రద్దీగా ఉండడంతో 13, 14 వ తేదీలలో ఉదయం నుండి మధ్యాహ్నం1 గంట వరకు ఆటోలు, కార్లు, బైకులకు నిషేధం ఉంటుందని, అనంతరం ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మహిళలు బతుకమ్మ ఆడుకునే సమయంలో ఎవరైనా పోకిరీలు అసభ్యంగా ప్రవర్తిస్తే 100 కాల్ చేయాలని […]

Update: 2021-10-12 04:22 GMT

దిశ, మంచిర్యాల: సద్దుల బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మార్కెట్లోకి వాహనాల ప్రవేశం నిషేధించడం జరిగిందని ఏసీపీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్ ప్రాంతంలో చాలా రద్దీగా ఉండడంతో 13, 14 వ తేదీలలో ఉదయం నుండి మధ్యాహ్నం1 గంట వరకు ఆటోలు, కార్లు, బైకులకు నిషేధం ఉంటుందని, అనంతరం ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మహిళలు బతుకమ్మ ఆడుకునే సమయంలో ఎవరైనా పోకిరీలు అసభ్యంగా ప్రవర్తిస్తే 100 కాల్ చేయాలని సూచించారు. తమ సొంత ఊర్లకు వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలు వెంట తీసుకెళ్లాలని పేర్కొన్నారు. 15వ తేదీ దసరా సందర్భంగా ఎవరైనా మద్యం తాగి రోడ్లపై తిరుగుతూ ప్రజా శాంతికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. మంచిర్యాల డివిజన్ పరిధిలోని ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    

Similar News