ఓఆర్ఆర్పై వాహనాలకు అనుమతి
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌పై ఈ అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతిస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఈ నెల 20 ( బుధవారం అర్ధరాత్రి ) నుంచి వాహనాలను అనుమతించాలని హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. […]
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌పై ఈ అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతిస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఈ నెల 20 ( బుధవారం అర్ధరాత్రి ) నుంచి వాహనాలను అనుమతించాలని హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్ఎండీఏ సూచించింది. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుందని, వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఏ పేర్కొంది. కర్ఫ్యూ అమలులో ఉన్న వేళల్లో (రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు) ఓఆర్ఆర్పై కార్లను అనుమతించరు. ఓఆర్ఆర్పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణికులను తరలించకూడదని స్పష్టం చేశారు.