ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు
దిశ, వెబ్ డెస్క్: ఒకవైపు కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న ప్రజలకు వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ. 1.24.. లీటర్ డీజిల్ పై 0.93 పైసలు పెంచింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోవడంతో పెంపు అనివార్యమైందని రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 4,480 కోట్లుగా […]
దిశ, వెబ్ డెస్క్: ఒకవైపు కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న ప్రజలకు వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ. 1.24.. లీటర్ డీజిల్ పై 0.93 పైసలు పెంచింది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోవడంతో పెంపు అనివార్యమైందని రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం… ఈ నెలలో 29.5 శాతానికి తగ్గి రూ. 1,323 కోట్లకు పడిపోయిందని చెప్పారు. గత నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు. రెవెన్యూ పడిపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచామని చెప్పారు.