ఏపీలో చట్టం, నేరం కలిసి ప్రయాణిస్తున్నాయి: వర్ల
ఆంధ్రప్రదేశ్‌లో చట్టం, నేరం కలిసి ప్రయాణిస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని అన్నారు. మాచర్ల దాడి ఘటన చూసిన తర్వాత కూడా శాంతిభద్రతలు బాగున్నాయని పోలీసులు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. మాచర్ల ఘటన దర్యాప్తులో అన్నీ తప్పటడుగులేనని వర్ల విమర్శించారు. నేరస్తుడికి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టలేదని ఆయన ఆరోపించారు. మాచర్ల ఘటనలో అక్కడి సీఐపై […]
ఆంధ్రప్రదేశ్‌లో చట్టం, నేరం కలిసి ప్రయాణిస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని అన్నారు. మాచర్ల దాడి ఘటన చూసిన తర్వాత కూడా శాంతిభద్రతలు బాగున్నాయని పోలీసులు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
మాచర్ల ఘటన దర్యాప్తులో అన్నీ తప్పటడుగులేనని వర్ల విమర్శించారు. నేరస్తుడికి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టలేదని ఆయన ఆరోపించారు. మాచర్ల ఘటనలో అక్కడి సీఐపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీ ప్రకటన చేయాలని వర్ల డిమాండ్ చేశారు. పోనీ తెనాలిలో టీడీపీ తరపున నామినేషన్ వేసిన వ్యక్తి ఇంట్లో మద్యం పెట్టిన ఘటనలో నిందితుడిపై ఎలాంటి చేపట్టారో చెప్పాలని డీజీపీని అడిగారు.
చంద్రబాబు విశాఖ పర్యటన, మాచర్ల దాడి ఘటన, తెనాలిలో అక్రమ మద్యం ఘటనలను చూస్తే… చట్టం, నేరం కలిసి ప్రయాణిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. డీజీపీని సైతం కోర్టులో నిల్చునే విధంగా చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని డిమాండ్ చేశారు.
Tags: ap, tdp, ysrcp, dgp, varla ramaiah, macherla, tenali, local body elections