'కడ్తా..’ దోపిడీ ఆగేనా..?

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘కడ్తా’.. ఇందూరు రైస్ మిల్లర్లు, దళారులు, ప్రైవేట్ వ్యాపారులు వడ్ల సేకరణలో భాగంగా తరుగు పేరిట బలవంతంగా వసూలు చేసే ధాన్యానికి పెట్టిన పేరిది.  రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో తాలు, తరుగు పేరిట క్వింటాకు కిలో, రెండు కిలోల వడ్లు తీస్తుంటారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనుగోలుదారులు దశాబ్దాలుగా క్వింటాకు 5 నుంచి 7 కిలోల ధాన్యం కటింగ్ చేస్తూనే ఉన్నారు. లేకపోతే మరపట్టించి ఇవ్వరు.. గిర్నీ నడవదు.. ఇలా […]

Update: 2020-11-02 00:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘కడ్తా’.. ఇందూరు రైస్ మిల్లర్లు, దళారులు, ప్రైవేట్ వ్యాపారులు వడ్ల సేకరణలో భాగంగా తరుగు పేరిట బలవంతంగా వసూలు చేసే ధాన్యానికి పెట్టిన పేరిది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో తాలు, తరుగు పేరిట క్వింటాకు కిలో, రెండు కిలోల వడ్లు తీస్తుంటారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనుగోలుదారులు దశాబ్దాలుగా క్వింటాకు 5 నుంచి 7 కిలోల ధాన్యం కటింగ్ చేస్తూనే ఉన్నారు. లేకపోతే మరపట్టించి ఇవ్వరు.. గిర్నీ నడవదు.. ఇలా తరుగు పేరుతో నిర్వాహకులు, మిల్లర్లు, కొనుగోలు దారులు రైతులను దోపిడీ చేస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రూ. కోట్లలో దోపిడీ..

ప్రతి ఏడాది కడ్తా పేరిట రైతుల నుంచి తీసే ధాన్యం విలువ రూ. కోట్లలో ఉంటుంది. కడ్తా తీసే గ్యాంగ్ లీడర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి వంత పాడడం, ఎవరి వాటాలు వారికిచ్చేయడంతో అసలు దో పిడీ కి అడ్డుకట్ట వేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది అధికార యంత్రాంగం ప్రకటనలు చేయడం, తూతూ మంత్రంగా ఒకటి, అర రైస్ మిల్లులను సీజ్ చేయడం మామూలే.

బహిరంగ రహస్యం..

ధాన్యం సేకరణ సమయంలో దళారులు, వ్యాపారులు, మిల్లర్ల బహిరంగ దోపిడీకి ‘కడ్తా’ పరాకాష్టా. పంట పెట్టుబడుల కోసం అడ్తి వ్యాపారుల వద్ద అప్పలు తె చ్చుకున్న రైతులు వారు చెప్పిన ధరలకు తోడు ‘కడ్తా’ కింద ధాన్యాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇక ప్ర భుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తాత్సరం చేసినా, మద్దతు ధర ప్రకటన ఆలస్యంగా వచ్చిన సమ యంలో దళారులు, వ్యాపారులు, మిల్లర్లు ఒక్కటై కొనుగోళ్లు చేస్తూ దోపిడీ కి పాల్పడుతున్నారు. అలాగే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం లేవీ కోసం మిల్లులకు అప్పగించినప్పుడు సైతం బహిరంగంగానే దోపిడీ కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. వే బ్రిడ్జిలో మతలబు చేయడం, లేదా డైరెక్టుగా లారీలో ఉన్న సరుకు ఆధారంగా ‘కడ్తా’ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారికంగా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగినట్లు తెలిసింది.

అధికారుల హెచ్చరికలు..

గతంలో పంటల నూర్పిడి సమయంలో వడ్లలో కొద్దిగా ఊక(తర్ర), మట్టి పెళ్లలు ఉండేవి. కొనుగోలు సమయంలో కిలో వరకు తరుగు తీసినా రైతులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ, ప్రస్తుతం యాంత్రీకరణ ద్వారా పంటల నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రా లకు తీసుకెళ్తే కడ్తా తీస్తామంటే ఉరుకునేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. దానికి తోడు ఉమ్మడి జి ల్లాల పాలనాధికారులు కడ్తా పేరిట ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తే ఉరుకోమని, రైస్ మిల్లుల సీజ్ చేస్తా మని హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా లో అధికారులు వే బ్రిడ్జిలను తనిఖీలు చేసి తప్పుడు లెక్కలు చూపిస్తున్న నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే ‘కడ్తా’ ద్వారా రూ. కోట్ల రాబడిని పోగొట్టుకోవడం ఇష్టం లేని గ్యాంగ్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోంది. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లోనైనా కడ్తాకు బ్రేక్ పడుతుందా..? లేదా?? అనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News