‘చంద్రబాబు నాకు విప్ జారీ చేసేంత మగాడా?’

దిశ, ఏపీ బ్యూరో: నాకు విప్ జారీ చేసేంత మగాడా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నుంచి తనను బహిష్కరించారని చెప్పారు. స్పీకర్ తనను ప్రత్యేక సభ్యుడిగా చూస్తున్నారని వంశీ వెల్లడించారు. తనకు విప్ జారీ చేయడానికి చంద్రబాబు వద్ద ఏముంది ఉడకబెట్టిన నాగడి దుంప అని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి సస్పెండైన […]

Update: 2020-06-19 08:21 GMT

దిశ, ఏపీ బ్యూరో: నాకు విప్ జారీ చేసేంత మగాడా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నుంచి తనను బహిష్కరించారని చెప్పారు. స్పీకర్ తనను ప్రత్యేక సభ్యుడిగా చూస్తున్నారని వంశీ వెల్లడించారు. తనకు విప్ జారీ చేయడానికి చంద్రబాబు వద్ద ఏముంది ఉడకబెట్టిన నాగడి దుంప అని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి సస్పెండైన తనకు విప్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.

చెంచాల మాట విని బాబు పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. గతంలో ఇదే విషయం బాబుకు చెప్పానని వంశీ వెల్లడించారు. హైదరాబాదులోని కొన్ని ఛానెల్స్‌కి చంద్రబాబు డబ్బులిచ్చి వార్తలు రాయించుకుంటున్నారని, అవే బాబుకి ప్రాణం పోస్తున్నాయని వంశీ అన్నారు. రాజ్యసభ సీటు గెలిచే అవకాశం ఉన్నప్పుడు వ్యాపారవేత్తలకు చంద్రబాబు సీట్లిచ్చారన్న వంశీ, సంఖ్యాబలం లేదని, గెలిచే అవకాశం లేదని తెలిసినా దళితుడికి అవకాశమిచ్చారని విమర్శించారు. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు.

దీనిపై మరో టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ, గెలవం అని తెలిసి కూడా వర్ల రామయ్యకు టిక్కెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు, గెలిచే సమయంలో సీట్లకు తులాభారం నిర్వహించిన బాబుకు అప్పుడు వర్ల రామయ్య గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బాబు పక్కనున్న బ్యాచ్‌ను పక్కన పెడితే బెటర్‌ అని సూచించారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ నిర్మాణంపై దృష్టిపెడితే మంచిదని సలహా ఇచ్చారు. ఆయనకు ఓపిక లేకపోతే లోకేష్‌నైనా సీట్లో కూర్చోబెట్టాలని సూచించారు. సస్పెండ్ చేసి, విప్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తనను స్పీకర్ ప్రత్యేక సభ్యునిగా గుర్తించారని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 17 ఓట్లు మాత్రమే పడ్డాయని తెలిపారు.

Tags:    

Similar News