వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు
దిశ, వెబ్‌డెస్క్: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. స్వామివారికి ఏకాంతంగా నిత్య కైంకర్యాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రముఖులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఈ ఏడాది 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలని […]
దిశ, వెబ్‌డెస్క్: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తెరిచారు. స్వామివారికి ఏకాంతంగా నిత్య కైంకర్యాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రముఖులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
ఈ ఏడాది 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. నేడు స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.