నన్నే అడ్డుకుంటారా.. మీకెంత ధైర్యం?

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి హల్‌చల్ చేశారు. గురువారం ఉదయం టోల్‌గేట్ వద్ద రేవతి వాహనం ఆపకుండా వెళుతుండగా, టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన చైర్ పర్సన్ ‘‘నా కారునే అడ్డుకుంటారా.. మీకెంత ధైర్యం’’ అని టోల్ సిబ్బందిపై ఏకంగా చేయి చేసుకున్నది. దీంతో బెంబేలెత్తిన టోల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంరతం పోలీసుల జోక్యంతో […]

Update: 2020-12-09 21:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి హల్‌చల్ చేశారు. గురువారం ఉదయం టోల్‌గేట్ వద్ద రేవతి వాహనం ఆపకుండా వెళుతుండగా, టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన చైర్ పర్సన్ ‘‘నా కారునే అడ్డుకుంటారా.. మీకెంత ధైర్యం’’ అని టోల్ సిబ్బందిపై ఏకంగా చేయి చేసుకున్నది. దీంతో బెంబేలెత్తిన టోల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంరతం పోలీసుల జోక్యంతో సమస్య సర్దుమణిగి, చైర్ పర్సన్ రేవతి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Tags:    

Similar News