టీకా తీసుకున్న మాస్క్ తప్పనిసరి : మోడీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోడీ వర్చువల్ మీట్ ద్వారా ప్రారంభించారు. దీంతో ఒకే సమయంలో దేశమంతటా 3,006 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో కరోనాకు మందు వచ్చిందని.. రాత్రింబవళ్లు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్లే అది సాధ్యమైందన్నారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ లు రెండు మనకు అందుబాటులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో మరికొన్ని రానున్నాయని గుర్తుచేశారు. ప్రధాని మాటల్లో […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోడీ వర్చువల్ మీట్ ద్వారా ప్రారంభించారు. దీంతో ఒకే సమయంలో దేశమంతటా 3,006 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో కరోనాకు మందు వచ్చిందని.. రాత్రింబవళ్లు శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్లే అది సాధ్యమైందన్నారు. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ లు రెండు మనకు అందుబాటులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో మరికొన్ని రానున్నాయని గుర్తుచేశారు. ప్రధాని మాటల్లో భాగంగా గురజాడ అప్పారావు మాటలను గుర్తుచేశారు. ’దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్’ అని వ్యాఖ్యానించారు. అయితే, కరోనా వ్యాక్సిన్‌కు తొలి హక్కుదారులు సఫాయి కార్మికులు మరియు వైద్య సిబ్బంది అని గుర్తుచేశారు.
వ్యాక్సిన్ రెండు డోసులు వాడాలని… తొలి టీకా వేసుకున్న నెలరోజులకు రెండో టీకా తప్పనిసరి అని స్పష్టంచేశారు. కరోనా వచ్చిన తొలినాళ్లలో మాస్కులకు కూడా చాలా ఇబ్బంది పడ్డామని.. ఇప్పుడు భారత్ వైజ్ఞానిక సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని.. కరోనా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. దేశమంతా కరోనా వైరస్ ను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నదని.. ఇప్పుడు కూడా అంతే ధైర్యంతో టీకాను వేసుకోవాలని సూచించారు. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందజేస్తామన్నారు. కాగా, కరోనా టీకా తీసుకున్నా కూడా మాస్క్, భౌతికదూరం తప్పక పాటించాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.