రేపటి నుంచి 11 విభాగాల సూపర్ స్ప్రెడర్లకు వాక్సిన్

దిశ సిద్దిపేట: కరోనా వ్యాప్తి చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న 11 విభాగాల సూపర్ స్ప్రెడర్ లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే సూపర్ స్పైడర్లకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డుల పరిధిలో రైతు బజార్ లో పని చేస్తున్న […]

Update: 2021-06-01 08:52 GMT

దిశ సిద్దిపేట: కరోనా వ్యాప్తి చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న 11 విభాగాల సూపర్ స్ప్రెడర్ లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే సూపర్ స్పైడర్లకు వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రధానంగా జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డుల పరిధిలో రైతు బజార్ లో పని చేస్తున్న వ్యక్తులు 381 మంది, వెజ్ మార్కెట్ లో విక్రేతలు 183, పండ్ల, పూల మార్కెట్ విక్రేతలు 256, మాంసం విక్రేతలు 435, కిరాణా దుకాణం నిర్వాహకులు 927, మద్యం షాప్ నిర్వాహకులు 97, వీధి వ్యాపారులు 7719, హేర్ కటింగ్ షాప్ నిర్వాహకులు 327, ఐరన్ షాప్ నిర్వాహకులు 184, హోటల్ నిర్వాహకులు 715 మొత్తం 11,224 సూపర్ స్ప్రెడర్ లుగా గుర్తించామన్నారు.

సిద్దిపేట పట్టణంలో విశాలమైన ఫంక్షన్ హాల్ లో 11 మంది vaccinatorల ద్వారా రోజుకు 1100 మందికి చొప్పున 11 రోజుల పాటు వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారిని మంత్రి ఆదేశించారు. సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లాలోని మిగతా గజ్వేల్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ పట్టణాలలో కూడ 11 విభాగాల సూపర్ స్ప్రెడర్ లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లు చేపట్టాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News