ఏపీలో గర్భిణీ స్త్రీలకూ వాక్సిన్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకూ వాక్సినేషన్‌ ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై జరిగిన సమీక్షలో వాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులకు వాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వాక్సినేషన్‌ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్‌ ఇస్తున్నామని.. అలాగే […]

Update: 2021-07-05 11:07 GMT
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకూ వాక్సినేషన్‌ ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై జరిగిన సమీక్షలో వాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులకు వాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వాక్సినేషన్‌ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్‌ ఇస్తున్నామని.. అలాగే 5ఏళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యంగా టీకా వేయాలన్నారు. ప్రాధాన్యతల ప్రకారం విభాగాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు వాక్సినేషన్‌ పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు.
Tags:    

Similar News