AP:‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరోసారి విమర్శలు గుప్పించారు.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నేడు(శనివారం) మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)కు మాజీ మంత్రి అంబటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగనన్న జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పెన్షన్లు 50 శాతం తగ్గించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సంగతి ఆరు నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారని విమర్శించారు. కానీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు అని పేర్కొన్నారు.