అక్రిడేటెడ్ జర్నలిస్టులకే టీకా
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా వార్తలను ప్రాణాలొడ్డి ప్రచురించి ప్రసారానికి పాటుపడుతున్న జర్నలిస్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూసింది. వారికి ఉచిత టీకా విషయంలో కేవలం పౌర సంబంధాల శాఖ గుర్తించిన అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే టీకాలు వేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రారంభమైన టీకాల పంపిణీలో కేవలం అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే టీకాలను వేసారు. ఆర్ ఎన్ ఐ గుర్తింపుతో ఏర్పాటు చేసిన పత్రికలు కాని, చానళ్ళకు చెందిన రిపోర్టర్లకు సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా వార్తలను ప్రాణాలొడ్డి ప్రచురించి ప్రసారానికి పాటుపడుతున్న జర్నలిస్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూసింది. వారికి ఉచిత టీకా విషయంలో కేవలం పౌర సంబంధాల శాఖ గుర్తించిన అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే టీకాలు వేయాలని నిర్ణయించింది. శుక్రవారం ప్రారంభమైన టీకాల పంపిణీలో కేవలం అక్రిడేషన్ ఉన్న వారికి మాత్రమే టీకాలను వేసారు. ఆర్ ఎన్ ఐ గుర్తింపుతో ఏర్పాటు చేసిన పత్రికలు కాని, చానళ్ళకు చెందిన రిపోర్టర్లకు సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్న టీకాలు వేయకుండా మొండి చేయి చూపింది.
ఉమ్మడి జిల్లాలో 48 కేంద్రాలలో కోవిషిల్డ్ మొదటి డోసు వేసిన ఒక్క నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుకు టీకాను వేయలేదు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో 400 మంది, కామారెడ్డి జిల్లాలో 460 మంది అక్రిడేటడ్ జర్నలిస్టులు ఉన్నారు. మిగిలిన వారికి సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్న వారికి టీకా వేయలేదు. టీకా వేయాల్సిన అధికారులు కేవలం ప్రజా, పౌర సంబంధాల శాఖ ఇచ్చిన జాబితా ఆధారంగానే మొదటి డోస్ టీకా వేస్తున్నామని చెప్పడం విశేషం. వైద్య ఆరోగ్య శాఖాధికారులు తమకు జర్నలిస్టుల కోటా విషయంలో ఆన్ లైన్ లో అధికార యంత్రాంగం ఇచ్చిన డాటా, వారు ఇచ్చిన టోకెన్ల ఆధారంగా టీకాలు వేస్తున్నామని తెలిపారు.
కరోనా మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం సెకండ్ వేవ్ వరకు వచ్చే సరికి సూపర్ స్ర్పేడర్లుగా పరిగణించిన విషయం తెల్సిందే. ఫ్రంట్ లైన్ వారియర్స్ టీకాను ఉచితంగా వేసిన ప్రభుత్వం సూపర్ స్ర్పేడర్లుగా జర్నలిస్టులను పరిగణించి వారికి కూడా 28, 29 నాడు టీకాలు వేస్తున్న విషయం తెల్సిందే. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులను గ్యాస్ బండల్ మోసే వారికన్నా, రేషన్ దుకాణాల్లో పని చేసే సహాయకుల కన్నా అధ్వాన్నంగా ప్రభుత్వం చూసిందని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.