ఆర్మూర్ రిషిత్ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స...

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రీషిత్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు.

Update: 2024-11-18 15:10 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రీషిత్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లోని ముప్కల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజవ్వ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ..రీషిత్ ఆసుపత్రిలో వైద్య కోసం చేరింది. రాజవ్వ కడుపులో సుమారు 5 కిలోల భారీ కణితి ఉండడంతో..ఆసుపత్రి వైద్యులు పూర్తి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ కారకాలు లేని కణితిగా గుర్తించి సుమారు గంట పాటు శస్త్ర చికిత్స చేశారు. కడుపులో భారీ కణితి తొలగించారు. వయసు 65 దాటిన మహిళా రోగికి కడుపులోని భారీ కణితిని తొలగించేందుకు శాయశక్తులు కృషిచేసి ఆపరేషన్ ను విజయవంతం చేసిన వైద్యుడు వెంకట్ గౌడ్ కు రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తీవ్రంగా శ్రమించి ఓ మహిళా రోగి కడుపులోంచి కణితిని తొలగించిన వైద్యుడు వెంకట్ గౌడ్ కు ఆర్మూర్ పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.


Similar News