రూ.1.5 కోట్ల విలువైన మత్తు పదార్థాల ధ్వంసం

జక్రాన్ పల్లి మండలంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను సోమవారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.

Update: 2024-11-18 13:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్  నవంబర్ 18: జక్రాన్ పల్లి మండలంలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను సోమవారం ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి కె.మల్లారెడ్డి పర్యవేక్షణలో..సోమవారం ఎక్సైజ్ అధికారులు రూ.1.5 కోట్ల విలువైన ఎండు గంజాయి, డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. జక్రాన్ పల్లి మండలం పడ్కల్ గ్రామంలో మెడికేర్ సర్వీసెస్ లో వివిధ ఎక్సైజ్ స్టేషన్లు ఆర్మూర్, భీమ్గల్, నిజామాబాద్, మోర్తాడ్ లలో రూ. 1.05 కోట్ల విలువైన 353 కిలోల ఎండు గంజాయి, 1.5 కిలోల డైజోఫామ్ , 2.5 కిలోల ఆల్ఫ్రాజోలం ను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ వేణు మాధవరావు తెలిపారు. భీమ్గల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన 8 కేసులలో 102.5 కిలోల గంజాయి, ఒక కిలో డైజోఫాం, 500 గ్రాముల ఆల్ఫ్రాజోలంను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీపీఈఓ కె. మల్లారెడ్డి, ఎస్ హెచ్ఓ ఆర్మూర్, మోర్తాడ్, నిజామాబాద్, భీమ్గల్ స్టేషన్ ల ఎస్ హెచ్ ఓ లు కె. స్టీవెన్సన్, గుండప్ప, దిలీప్, పి. వేణు మాధవరావు లతో పాటు సంబంధిత స్టేషన్ల సిబ్బంది కూడా పాల్గొన్నారు.


Similar News