ఏపీలో నేటి నుంచి వ్యాక్సిన్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, చిన్నారులకు శనివారం నుంచి వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకాలు వేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. సర్జికల్ మాస్క్ ధరించి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. అలాగే, వ్యాక్సిన్ల కోసం వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. కాగా, ప్రతి బుధవారం, శనివారం ఆరోగ్యకేంద్రాల్లో డీపీటీ, తట్టు, పోలియో,రోటావైరస్ వంటి టీకాలు ఇవ్వనుండగా, కరోనా కారణంగా […]

Update: 2020-04-17 20:04 GMT

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, చిన్నారులకు శనివారం నుంచి వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీకాలు వేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. సర్జికల్ మాస్క్ ధరించి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. అలాగే, వ్యాక్సిన్ల కోసం వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. కాగా, ప్రతి బుధవారం, శనివారం ఆరోగ్యకేంద్రాల్లో డీపీటీ, తట్టు, పోలియో,రోటావైరస్ వంటి టీకాలు ఇవ్వనుండగా, కరోనా కారణంగా కొన్ని రోజులుగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Tags: vaccine, ap, amaravathi, polio, dpt, corona, rotavirus, social distance

Tags:    

Similar News