పిల్లలకు వ్యాక్సిన్.. ఎయిమ్స్ చీఫ్ గులేరియా కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెంకడ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే, పిల్లలకు మాత్రం ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్‌గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల కోసం కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని గులేరియా పేర్కొన్నారు. పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెంకడ్ వేవ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే, పిల్లలకు మాత్రం ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్‌గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల కోసం కొవిడ్ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని గులేరియా పేర్కొన్నారు.
పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు. కాగా, ఏడాదిన్నర కాలంగా కరోనా కారణంగా పిల్లల చదవుకు తీరని నష్టం వాటిల్లింది. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించడం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పిల్లలు వ్యాక్సిన్ తీసుకుంటే తల్లిదండ్రుల్లో కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు.
2 -18 ఏళ్ల లోపు వయస్సున్న వారి కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇక, దేశంలో పిల్లల కోసం ఫైజర్, జైడస్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించినా అది మంచి పరిణామం అవుతుందని గులేరియా పేర్కొన్నారు.