ఫిబ్రవరి తొలివారంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా

న్యూఢిల్లీ: వచ్చే నెల తొలి వారంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వైద్య సిబ్బందికి టీకా పంపిణీ ఈ నెల 16న మొదలైన సంగతి తెలిసిందే. వీరితోపాటుగా ఏకకాలంలోనే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని లేఖ రాశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల సమాచారాన్ని రాష్ట్రాలు క్రోడీకరిస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 61 లక్షల […]

Update: 2021-01-29 12:29 GMT

న్యూఢిల్లీ: వచ్చే నెల తొలి వారంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వైద్య సిబ్బందికి టీకా పంపిణీ ఈ నెల 16న మొదలైన సంగతి తెలిసిందే. వీరితోపాటుగా ఏకకాలంలోనే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని లేఖ రాశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల సమాచారాన్ని రాష్ట్రాలు క్రోడీకరిస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 61 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్ల డేటాను కొవిన్‌ యాప్‌లో అప్‌డేట్ చేశారని సమాచారం. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు మొత్తం 29,28,053 మందికి టీకా వేసినట్టు కేంద్రం తెలిపింది.

Tags:    

Similar News