కాంగ్రెస్‌లో కోవర్టులు.. రేవంత్ జైలుకు పోతే ఎలా..?: వీహెచ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ వ్యవహారం ముదురుతూనే ఉంది. తాజాగా మరోసారి పీసీసీ వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇటీవల జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో తాను ఉన్నట్టు మరోసారి గుర్తుచేశారు. ఇటువంటి పరిణామాల మధ్య రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ.. పరోక్ష హెచ్చరికలు చేశారు వి.హనుమంతరావు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టలేదని చెప్పుకొచ్చిన వీహెచ్… రేవంత్ పీసీసీ అయితే గాంధీభవన్‌కు కూడా ఎవర్నీ రానివ్వడని ఆరోపించారు. […]

Update: 2021-06-03 02:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ వ్యవహారం ముదురుతూనే ఉంది. తాజాగా మరోసారి పీసీసీ వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇటీవల జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో తాను ఉన్నట్టు మరోసారి గుర్తుచేశారు. ఇటువంటి పరిణామాల మధ్య రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ.. పరోక్ష హెచ్చరికలు చేశారు వి.హనుమంతరావు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టలేదని చెప్పుకొచ్చిన వీహెచ్… రేవంత్ పీసీసీ అయితే గాంధీభవన్‌కు కూడా ఎవర్నీ రానివ్వడని ఆరోపించారు. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి జైలుకు పోతే.. జైలు చుట్టూ తిరగాలా అంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పీసీసీ ఇస్తే ఎలా ఊరుకుంటామని అధిష్టానాన్ని నిలదీశారు. అసలు పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందా అంటూ మండిపడ్డారు. కోవర్టులు ఉన్నన్ని రోజులు పార్టీ ఎదగదని కుండ బద్దలు కొట్టారు వీహెచ్. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలకు కూడా మింగుడుపడని అంశంగా మారిందని చర్చలు నడుస్తున్నాయి.

Tags:    

Similar News