రేవంత్ అరెస్ట్ పై ‘ఉత్త’ స్పందనేనా!
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మొక్కుబడిగా స్పందించారని ఆయన అనుచరవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఉత్తమ్ నామమాత్రంగా స్పందించడంలో అంతర్యమేమిటని ఆ వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు, రాల్యీలు, రాస్తారోకోలు చేశారు. ఢిల్లీ పెద్దలు కూడా అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ర్ట ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇంత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ […]
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మొక్కుబడిగా స్పందించారని ఆయన అనుచరవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఉత్తమ్ నామమాత్రంగా స్పందించడంలో అంతర్యమేమిటని ఆ వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు, రాల్యీలు, రాస్తారోకోలు చేశారు. ఢిల్లీ పెద్దలు కూడా అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ర్ట ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇంత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రతికాప్రకటనకే పరిమితం కావడం వెనక మర్మమేంటి అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలను ఉల్లంఘిస్తూ నిర్మించిన నిర్మాణాలు కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ, రేవంత్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ జన్వాడ గ్రామంలోని కేటీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ధర్నా చేయడానికి ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే అక్కడ వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఇంత తతంగం జరిగినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ మాత్రం స్పందించకపోవడంతో పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా తెరమీదికి వస్తున్నాయి. వారిద్దరి మధ్య వ్యక్తి వైరుధ్యాలు ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీని ప్రభుత్వం అరెస్ట్ చేయడంపట్ల ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డికీ లేదా అని రేవంత్ వర్గీయలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. సరైన రీతిలో స్పందించకపోవడం, పార్టీ తరఫున ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వకపోవడం వెనుక అసలు మతలబు ఏంటీ అన్న విషయంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. హుజూనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తమ సతీమణికి వ్యతిరేకంగా రేవంత్ అభ్యర్థిని బరిలో నిలపడానికి చేసిన ప్రయత్నాలే కారణమా.. వీరి ఇద్దరి మధ్య ఇంకేమైనా అంతర్గత విభేదాలు ఉన్నయా… అన్న విషయంపై ఆ పార్టీలో చర్చ నెలకొంది.
మరోవర్గం నేతలు రేవంత్‌రెడ్డి అరెస్టుకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చేసింది ప్రజాపోరాటం కాదని, ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం చేసిన పోరాటమని వారు అంటున్నారు. రేవంత్ నిజంగానే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలంటే ప్రజాసమస్యల పోరాటం చేయాలంటున్నారు. దీంతో గాంధీభవన్ మరోసారి గ్రూప్ తగదాలకు నెలవుగా మారిందుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.