కేబినెట్ నుంచి కేటీఆర్ తప్పుకోవాలి: ఉత్తమ్

దిశ, న్యూస్‌బ్యూరో: కేటీఆర్ ఫాంహౌస్ విచారణ న్యాయబద్ధంగా జరగాలంటే మంత్రి కేటీఆర్ కేబినెట్ నుంచి తప్పుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్‌ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ భార్య శైలిమ పేరు మీద భూమి ఉందని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో లీజుకు ఉన్న భూమి వివరాలు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఈ లీజు ఎవరి దగ్గర తీసుకున్నారో చెప్పితే […]

Update: 2020-06-06 08:27 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కేటీఆర్ ఫాంహౌస్ విచారణ న్యాయబద్ధంగా జరగాలంటే మంత్రి కేటీఆర్ కేబినెట్ నుంచి తప్పుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. 111 జీవోకు వ్యతిరేకంగా కేటీఆర్‌ అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ భార్య శైలిమ పేరు మీద భూమి ఉందని నిరూపించేందుకు తాను సిద్ధమన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో లీజుకు ఉన్న భూమి వివరాలు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఈ లీజు ఎవరి దగ్గర తీసుకున్నారో చెప్పితే మిగతా వివరాలన్నీ చెప్తానని, 301 నుంచి 303 సర్వే నెంబర్ వరకు కేటీఆర్‌కు భూములున్నాయని ఉత్తమ్ వివరించారు. వీటన్నింపైనా కేటీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేబినెట్ నుంచి కేటీఆర్‌ తప్పుకోవాలన్నారు. కేటీఆర్‌ అవినీతిపై పోరాడిన రేవంత్‌రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని, 111 జీవోను ప్రభుత్వం సవరించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News