నిజామాబాద్‌పై నిఘా.. డ్రోన్లతో నిశిత పరిశీలన

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలతో జన సంచారాన్ని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన బోధన్ బస్టాండ్, అహ్మద్‌పురా, ఖిల్లా రోడ్డు, మాలపల్లి, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్ కాలనీల్లో రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. జనం ఒక్కచోట గుమ్మికూడకుండా డ్రోన్‌ కెమెరాలతో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కంటైన్‌మెంట్ జోన్లు, క్లస్టర్లలో నిబంధనలు ఉల్లంఘించిన […]

Update: 2020-04-22 04:57 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలతో జన సంచారాన్ని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన బోధన్ బస్టాండ్, అహ్మద్‌పురా, ఖిల్లా రోడ్డు, మాలపల్లి, ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్ కాలనీల్లో రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. జనం ఒక్కచోట గుమ్మికూడకుండా డ్రోన్‌ కెమెరాలతో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కంటైన్‌మెంట్ జోన్లు, క్లస్టర్లలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారిపై నిఘా పెట్టామని, అలాంటి వారిని గుర్తించి వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.

Tags: Nizamabad, lockdown, drone camera, Acp srinivas

Tags:    

Similar News