‘కమలా హారీస్’ అమెరికన్ కాదు : ట్రంప్
దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నవంబర్‌లో అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగియనుండగా, ఇప్పటినుంచే అధికార రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండోసారి అధికారం చేపట్టాలని ట్రంప్ ఉవ్విళ్లురుతున్నారు. అది అంతా సులువు కాదని ఆయనకు కూడా తెలుసు. కరోనా వైరస్ నియంత్రణ, నల్లజాతీయుల హత్యల విషయంలో ఆయనపై అమెరికన్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. మొన్నటిదాకా ‘వీ కాంట్ బ్రీత్’ పేరుతో అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం […]
దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నవంబర్‌లో అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగియనుండగా, ఇప్పటినుంచే అధికార రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రెండోసారి అధికారం చేపట్టాలని ట్రంప్ ఉవ్విళ్లురుతున్నారు. అది అంతా సులువు కాదని ఆయనకు కూడా తెలుసు. కరోనా వైరస్ నియంత్రణ, నల్లజాతీయుల హత్యల విషయంలో ఆయనపై అమెరికన్ ప్రజలు గుర్రుగా ఉన్నారు.
మొన్నటిదాకా ‘వీ కాంట్ బ్రీత్’ పేరుతో అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారతీయ NRI ఓట్లను కొల్లగొట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీ ఇమేజ్‌ను వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ భారత సంతతి మహిళా ‘కమలా హారీస్’ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటించి రిపబ్లికన్లకు షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ‘కమలా హారిస్’పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హారిస్‌కు అమెరికా ఉపాధ్యక్షురాలిగా పోటీచేసే అర్హత లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు వలసొచ్చిన వారికి కమలా హారిస్ జన్మించిందని, అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆమెకు ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసే అర్హత లేదని ఇటీవల ఓ మేటి కన్జర్వేటివ్ న్యాయవాది పేర్కొన్నారు.
కమలాహారీస్ జననంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో వైట్‌హౌజ్‌లో ఈ అంశంపై ట్రంప్ మాట్లాడారు. ఉపాధ్యక్షురాలు అయ్యే అర్హత కమలాకు లేదని, ఆమె అర్హత గురించి కన్జర్వేటివ్ న్యాయవాది ప్రశ్నించారని ట్రంప్ గుర్తుచేశారు. ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసే ముందు డెమోక్రాట్లు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేదన్నారు. అమెరికాలో జన్మించనందున ఉపాధ్యక్షురాలు పదవికి కమలా హారీస్ అర్హురాలు కాదని ట్రంప్ స్పష్టంచేశారు.