అధ్యక్షుడిగా బైడెన్ తొలి సంతకాలు వీటిపైనే!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన కొన్ని వివాదాస్పద విధానాలను రద్దు చేయనున్నారు. అధ్యక్షుడిగా బుధవారం పగ్గాలు అందుకున్న తొలి రోజే పారిస్ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరే ఆదేశాలపై సంతకం పెట్టనున్నారు. ముస్లిం మెజారిటీ దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌నూ ఎత్తివేయనున్నారు. జో బైడెన్ శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తొలి రోజే కనీసం 10 కీలక ఆదేశాలను జారీ చేయనున్నారు. ‘అమెరికా ప్రస్తుతం నాలుగు సంక్షోభాలను ఏకకాలంలో ఎదుర్కొంటున్నది. […]

Update: 2021-01-18 09:00 GMT

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన కొన్ని వివాదాస్పద విధానాలను రద్దు చేయనున్నారు. అధ్యక్షుడిగా బుధవారం పగ్గాలు అందుకున్న తొలి రోజే పారిస్ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరే ఆదేశాలపై సంతకం పెట్టనున్నారు. ముస్లిం మెజారిటీ దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌నూ ఎత్తివేయనున్నారు. జో బైడెన్ శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తొలి రోజే కనీసం 10 కీలక ఆదేశాలను జారీ చేయనున్నారు. ‘అమెరికా ప్రస్తుతం నాలుగు సంక్షోభాలను ఏకకాలంలో ఎదుర్కొంటున్నది. కరోనావైరస్, దాని ఫలితంగా ఏర్పడిన ఆర్థిక పతనం, పర్యావరణ సంక్షోభం, జాతిపరమైన విద్వేషాలు. వీటిని వీలైనంత త్వరగా ఎదుర్కొని ప్రపంచంలో అమెరికా ఉన్నతస్థానాన్ని పదిలం చేయడానికి బైడెన్ నిర్ణయాత్మక ఆదేశాలు జారీ చేస్తారు’ అని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే తొలి రోజే అధ్యక్షుడిగా బైడెన్ పర్యావరణ హితాన్ని కోరుతూ మళ్లీ పారిస్ ఒప్పందంలో చేరడం, ముస్లిం మెజార్టీ దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాపీలపై సంతకాలు చేయనున్నట్టు వివరించారు.

Tags:    

Similar News