మయన్మార్ ఊచకోతపై అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడంటే?
న్యూఢిల్లీ: పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసి కూలదోసిన ఆర్మీ ప్రజలపై నరమేధం సాగించింది. ఇప్పటి వరకు 400కుపైగా పౌరులను ఊచకోత కోసింది. శనివారం ఒక్కరోజే 100 మందికిపైగా దారుణంగా చంపేసింది. చిన్నా పెద్ద అని తేడా చూడకుండా కాల్పులు జరుపుతోంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం కూలిదోసిన సైనిక పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సైనిక ప్రభుత్వ ఆగడాలపై యావత్ ప్రపంచం విస్తూపోతున్నది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ […]
న్యూఢిల్లీ: పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఫిబ్రవరి 1న తిరుగుబాటు చేసి కూలదోసిన ఆర్మీ ప్రజలపై నరమేధం సాగించింది. ఇప్పటి వరకు 400కుపైగా పౌరులను ఊచకోత కోసింది. శనివారం ఒక్కరోజే 100 మందికిపైగా దారుణంగా చంపేసింది. చిన్నా పెద్ద అని తేడా చూడకుండా కాల్పులు జరుపుతోంది. తాము ఎన్నుకున్న ప్రభుత్వం కూలిదోసిన సైనిక పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సైనిక ప్రభుత్వ ఆగడాలపై యావత్ ప్రపంచం విస్తూపోతున్నది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనిక ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని, ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే వారిని అంతమొందిస్తున్నదని మండిపడ్డారు. ఇష్టారీతిన ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నదని బైడెన్ స్వరాష్ట్రం డెలావేర్‌లో ఇచ్చిన ప్రసంగంలో పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్ కూడా హింసను ఖండించింది. ఆర్మ్‌డ్ డే సెలబ్రేషన్ రోజున మయన్మార్‌లో ఊచకోత జరగడం శోచనీయమని ఈయూ ఫారీన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా సహా 12 దేశాలు మయన్మార్‌లో హింసను ఖండిస్తూ అరుదైన ప్రకటన చేశాయి. మయన్మార్ ఆర్మీ బాధ్యతను మరిచి హింసకు పాల్పడుతున్నదని, ఇప్పటికైనా హింసను విరమించి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచనలు చేసింది.