చైనా వైపు అమెరికా యుద్ధ విమానాలు

దిశ, వెబ్ డెస్క్: చైనా తన సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతుండటంతో అగ్రరాజ్యం అమెరికా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించింది. యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌకలు, మరో నాలుగు యుద్ధ నౌకలు శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలోనే ఉన్నట్లు రియర్ అడ్మిరల్ జార్జ్ ఎం. వికోఫ్ వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కథనం వెలువడింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం అమెరికా కట్టుబడి […]

Update: 2020-07-04 07:59 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనా తన సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతుండటంతో అగ్రరాజ్యం అమెరికా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించింది. యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌకలు, మరో నాలుగు యుద్ధ నౌకలు శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలోనే ఉన్నట్లు రియర్ అడ్మిరల్ జార్జ్ ఎం. వికోఫ్ వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌లో కథనం వెలువడింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం అమెరికా కట్టుబడి ఉందని తన మిత్రపక్షాలకు చాటిచెప్పడం కోసమే యుద్ధ వాహక నౌకలను మోరించాం తప్ప మరో ఉద్దేశం లేదని వీకోఫ్ పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

దక్షిణ చైనా సముద్రంలో సహజవాయు, చమురు వనరుల కోసం చైనా ఆక్రమణలకు పాల్పడుతూ.. పొరుగు దేశాలకు భయభ్రాంతులకు గురిచేసేలా నౌకా విన్యాసాలకు పాల్పడుతుందని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే తాము చైనాను దృష్టిలో ఉంచుకొని కాకుండ మిత్రపక్షాలకు భరోసా కల్పించటం కోసం విమానా వాహక నౌకలను మోహరించినట్లు రియర్ అడ్మిరల్ జార్జ్ ఎం వికోఫ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News