కొత్త వివాదంలో ఫేస్‌బుక్!

దిశ, వెబ్‌డెస్క్: వరుస వివాదాలను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త పేరుతో రీబ్రాండింగ్ పనిని మొదలుపెట్టింది. దీనికోసం ‘మెటా’ అనే పేరుతో ముందుకొచ్చింది. అయితే, ఈసారి ఏకంగా కంపెనీ పేరుతోనే కొత్త వివాదాన్ని ఎదుర్కొంది. అమెరికాలోని, చికాగోకు చెందిన టెక్ సంస్థ మెటా కంపెనీ’ తాజాగా దీనిపై కోర్టును ఆశ్రయించింది. ఫేస్‌బుక్ సంస్థ రీబ్రాండ్ పేరుతో తమ కంపెనీ పేరైన మెటాను, తమ జీవనాన్ని దొంగలిస్తోందని ‘మెటా కంపెనీ’ వ్యవస్థాపకుడు నేట్ స్కూలిక్ ఆరోపించారు. […]

Update: 2021-11-07 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస వివాదాలను ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త పేరుతో రీబ్రాండింగ్ పనిని మొదలుపెట్టింది. దీనికోసం ‘మెటా’ అనే పేరుతో ముందుకొచ్చింది. అయితే, ఈసారి ఏకంగా కంపెనీ పేరుతోనే కొత్త వివాదాన్ని ఎదుర్కొంది. అమెరికాలోని, చికాగోకు చెందిన టెక్ సంస్థ మెటా కంపెనీ’ తాజాగా దీనిపై కోర్టును ఆశ్రయించింది. ఫేస్‌బుక్ సంస్థ రీబ్రాండ్ పేరుతో తమ కంపెనీ పేరైన మెటాను, తమ జీవనాన్ని దొంగలిస్తోందని ‘మెటా కంపెనీ’ వ్యవస్థాపకుడు నేట్ స్కూలిక్ ఆరోపించారు. ఫేస్‌బుక్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడింది. మొదట తమ కంపెనీని కొనేందుకు ప్రయత్నం చేసి విఫలం కావడంతో తమకున్న మీడియా శక్తిని ఉపయోగించి తమ ‘మెటా కంపెనీ’ని ఉనికిలో లేకుండా చేసేందుకు చూస్తోందన్నారు.

ఫేస్‌బుక్ సంస్థ ఎప్పటిలాగానే చెప్పేదొకటి, చేసేదొకటి ధోరణిలో ప్రయత్నించడం మాకు ఆశ్చర్యం కలిగించలేదని వివరించారు. ఫేస్‌బుక్‌పై అవసరమైన చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని మెటా కంపెనీ స్పష్టం చేసింది. గత మూడు నెలలుగా తమ కంపెనీని తక్కువ ధరకే విక్రయించాలని ఫేస్‌బుక్‌కు చెందిన లాయర్లు ఒత్తిడి చేస్తున్నారు. తాము ఆ ఆఫర్లను తిరస్కరించడంతో ఇతర మార్గాల్లో తమపై ఒత్తిడి తెస్తున్నారని సంస్థ సీఈఓ వివరించారు. ఈ ప్రకటననే బహిరంగ వివరణగా పరిగణించాలని ఆయన తెలిపారు.

Tags:    

Similar News