మరో తెలుగు ఓటీటీ వచ్చేసింది..

దిశ, వెబ్‌డెస్క్: మరో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసింది. ఊర్వశి ఓటీటీ పేరుతో వస్తున్న డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. సినిమా నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడం, మూవీ రిలీజ్‌కు సపోర్ట్ చేయడం ఊర్వశి ఓటీటీ ప్రత్యేకత కాగా, ఈ సందర్భంగా ఆయన యాజమాన్యానికి శుభాకాంక్షలు అందించారు. కాగా తమ కార్యాలయాన్ని విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని ‘ఊర్వశి ఓటీటీ’ డైరెక్టర్స్ ఎం.ఎస్.రెడ్డి, రవి కనగాల […]

Update: 2020-12-17 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చేసింది. ఊర్వశి ఓటీటీ పేరుతో వస్తున్న డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. సినిమా నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించడం, మూవీ రిలీజ్‌కు సపోర్ట్ చేయడం ఊర్వశి ఓటీటీ ప్రత్యేకత కాగా, ఈ సందర్భంగా ఆయన యాజమాన్యానికి శుభాకాంక్షలు అందించారు. కాగా తమ కార్యాలయాన్ని విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని ‘ఊర్వశి ఓటీటీ’ డైరెక్టర్స్ ఎం.ఎస్.రెడ్డి, రవి కనగాల తెలిపారు. ఈ నెలాఖరు వరకు ‘ఊర్వశి ఓటీటీ’లో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ‘దండుపాళ్యం’ ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ రాజు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..