యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2020ను యూపీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను నిర్వహించే కొత్త తేదీని ఈ నెల 20న ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ నెల 31న ఈ పరీక్షలు నిర్వహంచాల్సి ఉంది. ఈ వారంలో పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ పరీక్షలను యూపీఎస్‌సీ వాయిదా వేసింది. గత నాలుగైదేళ్లతో పోలిస్తే ఈ సారి పరీక్షలు తొందరగా జరుగుతున్నాయి.అదీగాక, కరోనా ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని […]
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2020ను యూపీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను నిర్వహించే కొత్త తేదీని ఈ నెల 20న ప్రకటించనున్నట్టు తెలిపింది. ఈ నెల 31న ఈ పరీక్షలు నిర్వహంచాల్సి ఉంది. ఈ వారంలో పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ పరీక్షలను యూపీఎస్‌సీ వాయిదా వేసింది. గత నాలుగైదేళ్లతో పోలిస్తే ఈ సారి పరీక్షలు తొందరగా జరుగుతున్నాయి.అదీగాక, కరోనా ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాల్సిందిగా సివిల్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. అభ్యర్థులు నిరాశపడవద్దని, వారు ప్రిపేర్ కావడానికి, పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని అన్నారు. అనంతరం, తాజాగా, పరీక్షలను వాయిదా వేస్తూ కొత్త తేదీలను ఈ నెల 20న ప్రకటించనున్నట్టు యూపీఎస్‌సీ వెల్లడించింది.
tags: upsc, postpone, civil prelims, coronavirus