ఆంటీ పిలిచిందని వెళ్తే.. ప్రైవేట్ భాగాల్లో కర్ర పెట్టి..!
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో మరో అవమానీయ ఘటన వెలుగుచూసింది. మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ దళిత వ్యక్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు బంధువులు. అందరి ముందు పాయింట్ విప్పి ప్రైవేట్ భాగాల్లో కర్రలను ఇరికించి నరకం చూపించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖాన్‌పూర్ జిల్లాలోని సర్వాన్ ఖేడాలో నివాసం ఉంటున్న (దళిత వ్యక్తి) పెయింటర్‌కు.. ఇదే జిల్లాలోని అక్బర్‌పూర్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం […]
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో మరో అవమానీయ ఘటన వెలుగుచూసింది. మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ దళిత వ్యక్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు బంధువులు. అందరి ముందు పాయింట్ విప్పి ప్రైవేట్ భాగాల్లో కర్రలను ఇరికించి నరకం చూపించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే..
ఖాన్‌పూర్ జిల్లాలోని సర్వాన్ ఖేడాలో నివాసం ఉంటున్న (దళిత వ్యక్తి) పెయింటర్‌కు.. ఇదే జిల్లాలోని అక్బర్‌పూర్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. గత మూడు నెలలుగా వీరి కదలికలపై అనుమానం వచ్చిన కుటుంబీకులు వివాహేతర సంబంధం సాగిస్తున్నారని భావించారు. ఈ క్రమంలో బుధవారం సదరు మహిళ మీట్ అవుదామని పెయింటర్‌కు కాల్ చేసి చెప్పడంతో.. అతడు అక్బర్‌పూర్‌కు వెళ్లాడు. ఇది తెలుసుకున్న మహిళ కుటుంబీకులు గ్రామంలో మాటు వేశారు. సదరు వ్యక్తి రాగానే పట్టుకొని చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురి చేశారు. మహిళ జోలికి రావొద్దని ఓ కర్రను అతడి ప్రైవేట్ భాగాల్లో ఇరికించి నరకం చూపించారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. పిరుదులపై కర్రలతో కొట్టడం దారుణం.
వారి దెబ్బలు తాళలేక బాధితుడు కాళ్లు చేతులు మొక్కి వేడుకోవడంతో ఎట్టకేలకు వదిలేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక అక్బర్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు అక్బర్‌పూర్ ఇన్‌స్పెక్టర్ తులసిరామ్ పాండే తెలిపారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొనట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతం బాధితుడు లాలా లజ్‌పతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే.. తొలుత ఫిర్యాదు చేయడానికి వెళితే స్థానిక పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితుడి కుటుంబీకులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.