యూపీలో ‘ఇద్దరు పిల్లల నిబంధన’.. ప్రకటించిన సీఎం యోగి
లక్నో: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో నూతన జనాభా పాలసీని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జనాభా వృద్ధిరేటు 2.7శాతంగా ఉండగా, దాన్ని 2026వరకు 2.1కి, 2030వరకు 1.9శాతానికి తగ్గించడమే తాజా పాలసీ లక్ష్యమని తెలిపారు. జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డంకమని తెలిపారు. ఈ విధానం జనాభాను నియంత్రించడానికే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆనందకర జీవనానికి సంబంధించిన విషయమన్నారు. కాగా, ఈ బిల్లు ముసాయిదా […]
లక్నో: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో నూతన జనాభా పాలసీని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జనాభా వృద్ధిరేటు 2.7శాతంగా ఉండగా, దాన్ని 2026వరకు 2.1కి, 2030వరకు 1.9శాతానికి తగ్గించడమే తాజా పాలసీ లక్ష్యమని తెలిపారు. జనాభా పెరుగుదల అభివృద్ధికి అడ్డంకమని తెలిపారు. ఈ విధానం జనాభాను నియంత్రించడానికే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆనందకర జీవనానికి సంబంధించిన విషయమన్నారు. కాగా, ఈ బిల్లు ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులు, ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్స్ పొందలేరు.
ప్రభుత్వం అందించే పథకాలకు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ఇద్దరు పిల్లల నిబంధన పాటించేవారికి వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంటి పన్ను, గృహ రుణాల చెల్లింపులో డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లును యూపీ లా కమిషన్ అధికారిక వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేశారు. జూలై 19వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. వచ్చే నెలలో దీనిని అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.