ఆనందయ్య మందు తయారీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి..

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందుపై తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఎక్కడ పట్టినా దీని గురించే చర్చ. ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతుండగా.. ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది. ప్రభుత్వమే మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆనందయ్యకు పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయగా.. వేలమందికి సరిపోయేలా మందు తయారీ చేయిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా మందు తయారీ చేయిస్తున్నారు. […]

Update: 2021-05-25 22:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందుపై తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఎక్కడ పట్టినా దీని గురించే చర్చ. ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతుండగా.. ప్రభుత్వం త్వరలో అనుమతి ఇవ్వనుంది. ప్రభుత్వమే మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఆనందయ్యకు పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయగా.. వేలమందికి సరిపోయేలా మందు తయారీ చేయిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా మందు తయారీ చేయిస్తున్నారు. బకెట్లకొద్ది మందును తెలంగాణ, ఢిల్లీకి కార్లలో తరలిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలోని పుట్టా ఎస్టేట్‌లోని ఆర్ఆర్ క్యాటరింగ్‌లో మందు తయారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News