పేటలో గుప్పుమంటున్న గంజాయి.. కలవరపెడుతున్న కేసులు షాక్ అవుతున్న పోలీసులు

నిన్న పది కిలోలు మొన్న ఎనిమిది కిలోలు ఇలా వరుసగా నర్సరావుపేటలో గంజాయి పట్టుబడుతూనే ఉంది.

Update: 2024-09-28 15:23 GMT

దిశ, నరసరావుపేట: నిన్న పది కిలోలు మొన్న ఎనిమిది కిలోలు ఇలా వరుసగా నర్సరావుపేటలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. బయట పడుతున్న గంజాయి డంపులతో పేట కలవరపడుతుంది. స్టూడెంట్ రిక్షాపులర్లు గంజాయి మత్తు బానిసగా మారటంతో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటానికి కారణం అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలిలో మరో వ్యక్తి నుంచి రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు షాక్ అయ్యారు. గంజాయి పై కూటమి ప్రభుత్వం రెండు నెలలుగా సీరియస్ గా ఫోకస్ పెట్టిన ఇంకా గంజాయి నిల్వలు పట్టుబడటం పై పోలీసులు మరింత అలర్ట్ అవుతున్నారు. అయితే ఈ దాడుల్లో బయటకు వస్తున్న నిజాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి సప్లై..

ఇటివల నరసరావుపేటలో 10 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పిడుగురాళ్లలో గంజాయి స్మగ్లర్ బత్తుల శేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేజీ గంజాయిని రూ. 3వేలకు మురికిపూడి ప్రదీప్ చంద్రకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. చంద్ర గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ప్యాకెట్ రూ.200 అమ్ముతున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 1080 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటివల అమరావతి మండలం దిగుడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే క్రోసూరు మండలం హస్నాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళ నుంచి 300 గ్రాములు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అమరావతి అచ్చంపేట క్రోసూరు మండలాల్లో ఎక్కువ మంది యువత గంజాయి మత్తుకు బానిస అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే చదువుల పేరుతో రోడ్లపైకి వస్తున్న యువత విచ్చలవిడిగా గంజాయిని పీల్చేస్తున్నారు. చదువులు కోలువులు మధ్య క్రాస్ రోడ్డులో ఆశాజీవులుగా పరిగెత్తే యంగ్ జనరేషన్ రాంగ్ రూట్ లో మత్తుకు దగ్గరవుతున్నారు. గంజాయి నిషా మత్తుకు అలవాటు పడుతున్నా పిల్లల తీరుతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి సరఫరాను పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు.


Similar News