నటిగా మారబోతున్న కేంద్రమంత్రి కూతురు..
దిశ, సినిమా: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ కూతురు ఆరుషి నిశాంక్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్, ఎన్విరాన్మెంటలిస్ట్ అయిన ఆరుషి.. ‘తరిణి’ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. తన తండ్రి రచించిన నవల ఆధారంగా తెరకెక్కిన రీజనల్ ఫిల్మ్ ‘మేజర్ నిరాళ’కు గతంలో నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు యాక్ట్రెస్‌గా మారబోతున్నారు. హిమాలయన్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(డెహ్రాడూన్) చైర్ పర్సన్ కూడా అయిన ఆరుషి నిశాంక్.. […]
దిశ, సినిమా: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్ కూతురు ఆరుషి నిశాంక్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఇండియన్ క్లాసికల్ డ్యాన్సర్, ఎన్విరాన్మెంటలిస్ట్ అయిన ఆరుషి.. ‘తరిణి’ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. తన తండ్రి రచించిన నవల ఆధారంగా తెరకెక్కిన రీజనల్ ఫిల్మ్ ‘మేజర్ నిరాళ’కు గతంలో నిర్మాతగా వ్యవహరించిన ఆమె.. ఇప్పుడు యాక్ట్రెస్‌గా మారబోతున్నారు. హిమాలయన్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(డెహ్రాడూన్) చైర్ పర్సన్ కూడా అయిన ఆరుషి నిశాంక్.. 2015లో అభినవ్ పంత్‌ను పెళ్లి చేసుకుంది.
ఇండియన్ నేవీకి చెందిన ఆరుగురు మహిళలు ప్రపంచాన్ని చుట్టేసే కథ ‘తరిణి’ కాగా, ఇంటర్నేషనల్ కథక్ ఎక్స్‌పోనెంట్ అయిన ఆరుషి.. ఎక్స్‌ప్రెషన్స్, ఆర్ట్, స్టేజ్ ఎప్పుడూ తన ఫేవరెట్స్ అని చెప్తోంది. ప్రతీ ఆర్టిస్ట్ కూడా బిగ్ స్క్రీన్‌పై తమ కళను చూపించుకోవడం డ్రీమ్‌గా భావిస్తారని, తరిణితో తన కల నెరవేరుతోందని చెప్పింది. మీడియా తమ సినిమా గురించి కవరేజ్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. టీ – సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణణ్ కుమార్‌తో పాటు ఆరుషి కూడా సినిమాను నిర్మిస్తుండటం విశేషం.