డీఐజీ సుమతికి కొవిడ్ ఉత్తమ వారియర్ అవార్డు

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ పోలీస్‌శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి కొవిడ్ ఉత్తమ వారియర్‌గా ఎంపికయ్యారు. జాతీయ మహిళా కమిషన్ 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో విశిష్ట సేవలు అందించిన మహిళలు, మహిళా అధికారులకు జాతీయ మహిళా కమిషన్ ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా డీఐజీ సుమతి అవార్డును అందుకున్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు ఆహార ధాన్యాలు, మందులు, రవాణా […]

Update: 2021-01-31 07:58 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ పోలీస్‌శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి కొవిడ్ ఉత్తమ వారియర్‌గా ఎంపికయ్యారు. జాతీయ మహిళా కమిషన్ 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో విశిష్ట సేవలు అందించిన మహిళలు, మహిళా అధికారులకు జాతీయ మహిళా కమిషన్ ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా డీఐజీ సుమతి అవార్డును అందుకున్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు ఆహార ధాన్యాలు, మందులు, రవాణా తదితర అవసరాలకు లోటు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ శాఖలతో పాటు దాదాపు 90స్వచ్ఛంద సంస్థల సాయంతో నిత్యావసరాలను అందచేయడంలో ముఖ్య పాత్ర వహించారు. వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు రూపొందించిన ‘సేవా యాప్‌’ను సమర్థవంతంగా ఉపయోగించడంలో కీలకంగా వ్యవహారించారు. గృహ హింసపై డయల్ 100కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించేందుకు 24మంది సైకాలజిస్టులను ప్రత్యేకంగా నియమించి వెంటనే కౌన్సిలింగ్ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ విధమైన ఉత్త్తమ సేవలిందించినందుకు గుర్తింపుగా డీఐజీ సుమతికి జాతీయ మహిళా కమీషన్ ఈ ప్రత్యేక పురస్కారానికి ఎంపిక చేసింది.

Tags:    

Similar News