అంబర్‌పేట, గోల్నాక ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి సందర్శన
దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాలు, వరదలతో కకావికలమైన హైదరాబాద్ నగరంలో బాధితులకు సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సైన్యం కూడా వచ్చిందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడుతూ, సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యల గురించి ఇప్పటికే ప్రధాని మోడీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారని, ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వివరించారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. నగరానికి బుధవారం సాయంత్రం చేరుకున్న […]
దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాలు, వరదలతో కకావికలమైన హైదరాబాద్ నగరంలో బాధితులకు సహాయక చర్యలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సైన్యం కూడా వచ్చిందని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడుతూ, సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రజలకు అవసరమైన సహాయక చర్యల గురించి ఇప్పటికే ప్రధాని మోడీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారని, ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు వివరించారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. నగరానికి బుధవారం సాయంత్రం చేరుకున్న ఆయన గోల్నాక, అంబర్‌పేట, మూసారంబాగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని తాజా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకున్నారని, హోంశాఖ ఎప్పటికప్పుడు వివరాలకు అనుగుణంగా పర్యవేక్షిస్తూ ఉన్నదని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యల కోసం కేంద్ర బలగాలను పంపాల్సిందిగా ఆదేశించారని, ఆ ప్రకారం నగరానికి చేరుకున్న సైన్యం పాత బస్తీతో పాటు వివిధ లోతట్టు ప్రాంతాల్లో చర్యలు చేపట్టారని తెలిపారు.