వారి భవిష్యత్ బాధ్యత కేంద్రానిదే : కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి, అనేక కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి అనేకమంది పిల్లలు రోడ్డునపడ్డారు. వీరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. పిల్లల చదువు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. కరోనాతో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి, అనేక కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి అనేకమంది పిల్లలు రోడ్డునపడ్డారు. వీరిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. పిల్లల చదువు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. కరోనాతో దేశవ్యాప్తంగా అనేకమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.