దేశంలో తెలంగాణ టాప్.. ఎనిమిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్
పట్టణ ప్రాంతాల్లో తలసరి ఖర్చులో తెలంగాణ రాష్ట్రం టాప్‌గా నిలిచింది. గ్రామీణ ప్రాంతానికి వస్తే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణ ప్రాంతాల్లో తలసరి ఖర్చులో తెలంగాణ రాష్ట్రం టాప్‌గా నిలిచింది. గ్రామీణ ప్రాంతానికి వస్తే ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. స్టాటస్టిక్స్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన సర్వే నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఖర్చు వ్యత్యాసం తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో పర్ క్యాపిటా జాతీయ సగటు ఖర్చు రూ.6,996 ఉండగా, తెలంగాణ వ్యయం ఏకంగా రూ.8978గా ఉన్నది. అంటే దాదాపు రూ. 2వేలు ఎక్కువ. అదే గ్రామీణ ప్రాంతాల్లో పర్ క్యాపిటా జాతీయ సగటు వ్యయం రూ.4122 ఉండగా, తెలంగాణ రూ.5435గా ఉన్నది. పట్టణ ఖర్చులో తెలంగాణ టాప్ గా నిలవగా, గ్రామీణ ప్రాంతాల్లో కేరళ మొదటి స్థానంలో ఉన్నది.
కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమింటేషన్ శాఖ నెలవారి తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ)పై గృహ వినియోగ వ్యయ సర్వే నిర్వహించింది. మొదట 2022–23లో సర్వే నిర్వహించగా, వాటి ఫలితాలను 2024 ఫిబ్రవరిలో ప్రకటించారు. రెండో సర్వేను 2023 ఆగస్టు నుంచి 2024 జూలై మధ్యలో నిర్వహించి ఇటీవల విడుదల చేశారు. నెలవారి తలసరి వినియోగ వ్యయం 2023–24 వ్యయానికి సంబంధించి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2,61,953 ఇండ్ల నుంచి సేకరించారు. ఇందులో 1,54,357 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో , 1,07,596 ఇండ్లు పట్ణణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సర్వేను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంబంధంలేకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిపి లెక్కించి తెలిపారు.
ఏడాదికేడాది పెరుగుతున్న ఖర్చు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పర్ క్యాపిటా వ్యయం ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్నది. నెలవారి తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) సర్వేలో భాగంగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో సగటున రూ.6,996 లు వెచ్చిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాకుండా ప్రజలు వారు సొంతంగా ఖర్చు పెడుతున్న డబ్బులతో లెక్కలు వేసి ఈ మొత్తాన్ని ఖరారు చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,247, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.7,078 ఉన్నట్లుగా తేలింది. ప్రజలు పెడుతున్న సగటు ఖర్చు 2022–23తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం పెరిగినట్లుగా నివేదికలో స్పష్టమైంది.
పట్టణాలు, గ్రామాల మధ్య తగ్గుతున్న ఖర్చు వ్యత్యాసం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెడుతున్న ఖర్చు వ్యత్యాసం 2011–12లో 84 శాతం ఉండగా, 2022–23 వచ్చే సరికి 71 శాతానికి తగ్గింది. 2023–24లో అది 70 శాతానికి తగ్గింది. 2023–24లో ఆహారేతర ఖర్చులు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం ఉన్నట్లుగా తేలింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రాసెస్డ్ ఫుడ్, రిఫ్రెష్ మెంట్స్, బేవరేజెస్ కు ఖర్చు ఎక్కువ పెడుతున్నారని గుర్తించారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో అహారేతర వ్యయంలో ప్రధానంగా దుస్తులు, రవాణా, వినోదం, చెప్పులు, తదితరమైనవి ఉన్నాయని గుర్తించారు. పట్టణాల్లో ఆహారేతర ఖర్చులో ఇంటి అద్దె , హోటల్ అద్దె, గార్బెజ్ అద్దె తదితర వాటికి 7 శాతం నిధులను వెచ్చిస్తున్నారు.
పట్టణాల్లో అత్యధికంగా ఖర్చు పెడుతున్న రాష్ట్రాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చుల వివరాలు