విద్యాకమిషన్ ఇప్పటి వరకు ఎన్ని విద్యాసంస్థల్లో విజిట్ చేసిందంటే..?

రాష్ట్రంలో విద్యాసంస్థల బలోపేతం కోసం తెలంగాణ విద్యాకమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Update: 2024-12-29 16:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యాసంస్థల బలోపేతం కోసం తెలంగాణ విద్యాకమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇటీవల నుంచి విద్యాసంస్థల విజిట్ ను చేపడుతున్న ఈ కమిషన్ బృందం ఇప్పటి వరకు 87 స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూల్లు, ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ కాలేజీలను విజిట్ చేసినట్లు ఆకునూరి మురళి ఎక్స్ వేదికగా వెల్లడించారు. విద్యాసంస్థల విజిట్ తో పాటు దాదాపు 47 కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనట్లు మురళి చెప్పుకొచ్చారు.


Similar News