Mettu: ధరణి స్కాం అయితే భూభారతి స్కీం.. మెట్టు సాయికుమార్ హాట్ కామెంట్స్
ధరణి(Dharani) అనేది స్కాం(Scam) అయితే భూ భారతి(Bhu Bharathi) అనేది స్కీం(Scheme) అని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్(Mettu Saikumar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: ధరణి(Dharani) అనేది స్కాం(Scam) అయితే భూ భారతి(Bhu Bharathi) అనేది స్కీం(Scheme) అని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్(Mettu Saikumar) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS Party) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులపై భారం పడకుండానే భూ భారతి తీసుకొచ్చామని, బీఆర్ఎస్ వాళ్ల లాగా ధరణి పేరుతో రైతులను భయబ్రాంతులకు గురి చేసి ఆస్తులు కొల్లగొట్టడం లేదని ఆరోపించారు. కేటీఆర్(KTR) అధికారులను చేతిలో పెట్టుకొని ధరణి పేరుతో స్కాం చేశారని, దీంతో ఇబ్బంది పడ్డ రైతులు బీఆర్ఎస్ ను గత ఎన్నికల్లో తరిమి కొట్టారని తెలిపారు.
ధరణి స్కాం అని, భూ భారతి స్కీం అని, స్కాంకి, స్కీంకి చాలా తేడా ఉంటుందని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ(Congress Party) అని, రైతుల కోసం ఎలాంటి మేలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కల్వకుంట్ల(Kalvakuntla) కుట్రలు తేల్చడానికే భూ భారతి తీసుకొచ్చామని, దీని ద్వారా నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులపై బీఆర్ఎస్ నాయకుల(BRS Leaders) మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేవారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసిందని, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తుందని, త్వరలోనే రైతు భరోసా కూడా అమలు చేయబోతున్నదని సాయి కుమార్ చెప్పారు.