BRS: ప్రజల బతుకు మారుస్తానని లోగోలు మారుస్తున్నడు.. హరీష్ రావు హాట్ కామెంట్స్
అధికారంలోకి వస్తే ప్రజల బతుకుదెరువును మారుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు లోగో(Logo)లను, పేర్ల(Names)ను మారుస్తున్నాడని మాజీమంత్రి హరీష్ రావు(BRS Leader Harish rao) ఎద్దేవా చేశారు.
దిశ, వెబ్ డెస్క్: అధికారంలోకి వస్తే ప్రజల బతుకుదెరువును మారుస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు లోగో(Logo)లను, పేర్ల(Names)ను మారుస్తున్నాడని మాజీమంత్రి హరీష్ రావు(BRS Leader Harish rao) ఎద్దేవా చేశారు. సంగారెడ్డి(Sangareddy)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో క్రైమ్ రేట్(Crime Rate) విపరీతంగా పెరిగిందని, క్రైమ్ డిటెక్షన్(Crime Detection) లో బీహార్(Bihar) కంటే తెలంగాణ వెనుకబడిందని విమర్శించారు. హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడని, ఏమైనా అంటే తెలంగాణ పోలీస్ లోగో మార్చామని చెబుతారని, లోగోలు మారిస్తే ఏం వస్తుందని మండిపడ్డారు. అధికారంలో రాకముందు ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తా.. ప్రజల బతుకులు మారుస్తా అని చెప్పి లోగోలు, పేర్లు, విగ్రహాలు మారుస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, పోలీసులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు. లోగోలు మార్చడం కాదని, పోలీసులకు అవసరమైన సాంకేతికతను, నిధులకు అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో అనేక సమస్యలను పోలీసులు ఎదుర్కోంటున్నారని హరీష్ రావు అన్నారు.