కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మాతృవియోగం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తల్లి స్నేహలత(89) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తన తల్లి నేత్రాలను దానం చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. తల్లి కోరిక మేరకు నేత్రాలను దానం చేసినట్టు వివరించారు. తల్లి మరణానికి సంబంధించి కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో భావోద్వేగంగా ట్వీట్ చేశారు. తనకు అత్యంత ప్రియమైన తల్లి ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారని తెలిపారు. మార్గదర్శి, తాత్వికురాలైన తల్లి ఈ లోకాన్ని వీడి తన జీవితంలో ఎవరూ […]
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తల్లి స్నేహలత(89) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తన తల్లి నేత్రాలను దానం చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. తల్లి కోరిక మేరకు నేత్రాలను దానం చేసినట్టు వివరించారు. తల్లి మరణానికి సంబంధించి కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో భావోద్వేగంగా ట్వీట్ చేశారు. తనకు అత్యంత ప్రియమైన తల్లి ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారని తెలిపారు. మార్గదర్శి, తాత్వికురాలైన తల్లి ఈ లోకాన్ని వీడి తన జీవితంలో ఎవరూ పూర్తి చేయని శూన్యాన్ని నింపిందని వివరించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.