పోలవరంపై విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. సోమవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ మాట్లాడుతూ.. 2013-14 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. కాగా, రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017 లెక్కల ప్రకారం అంచనాలను తయారు చేసిందని.. వాటిని పరిశీలించి కేబినెట్‌కు పంపుతామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేబినెట్ నిర్ణయం ప్రకారం సవరించిన అంచనాలపై ముందుకెళ్తామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తెలిపారు. రీ […]

Update: 2021-02-08 02:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. సోమవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ మాట్లాడుతూ.. 2013-14 ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. కాగా, రివైజ్డ్ కాస్ట్ కమిటీ 2017 లెక్కల ప్రకారం అంచనాలను తయారు చేసిందని.. వాటిని పరిశీలించి కేబినెట్‌కు పంపుతామని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుపై కేబినెట్ నిర్ణయం ప్రకారం సవరించిన అంచనాలపై ముందుకెళ్తామని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తెలిపారు. రీ ఎంబర్స్‌మెంట్‌ పద్దతిలో నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. వచ్చే మూడు నెలల్లో ప్రాజెక్టు స్పిల్ వే పనులు పూర్తవుతాయని.. కాపర్ డ్యామ్ పూర్తయితే 41 మీటర్ల దగ్గర నీటిని నిల్వ చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో లక్ష ఎకరాల భూమి మునిగిపోతుందని.. నిర్వాసితులకు తొలి విడతలో భాగంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తున్నామని గజేంద్రసింగ్ షేకావత్ వెల్లడించారు.

Tags:    

Similar News